ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Tuesday, March 26, 2013

వేమన పద్యాలు - 3

ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వధాభిరామ వినురవేమ

ఉప్పూ కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి. రుచులు వేరు వేరుగా ఉంటాయి. మనుషులందరూ ఒకే విధంగా కనిపించినా, అందులో మంచి వారు వేరు.

salt and camphor look alike, but their qualities are different. likewise people look alike but good people are different among them.

Monday, March 25, 2013

వేమన పద్యాలు - 2

అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వధాభిరామ వినురవేమ

నీచుడు ఎప్పుడూ ఆడంబరముగా మాట్లాడుతాడు. సజ్జనుండు చల్లగా మాట్లాడుతాడు. కంచుమోగినట్లు కనకంబు మోగదు కదా.

Saturday, March 23, 2013

వేమన పద్యాలు - 1

ఆత్మశుద్ధి  లేని ఆచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినురవేమ