ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Wednesday, April 24, 2013

వేమన పద్యాలు - 7

అన్నిదానములను అన్నదానమె గొప్ప
కన్నవారి కంటె ఘనులులేరు
ఎన్న గురువు కంటె ఎక్కువ లేరయా
విశ్వధాభిరామ వినురవేమ

దానాలలోకెల్ల అన్నదానము గొప్పది. తల్లిదండ్రుల కంటె గొప్పవారు లేరు. అలాగే గురువును మించిన వారెవరూ లేరు.

Donating food is best of all donations. Parents are greatest of all on earth and a teacher is the best guide.

Friday, April 19, 2013

వేమన పద్యాలు - 6

తప్పులెన్నువారు తండోపతండంబు
ఉర్విజనుల కెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమతప్పు లెరుగరు
విశ్వధాభిరామ వినురవేమ

తప్పులు వెదికే వారు దండిగా ఉన్నారు. ఈ నేలమీద ఉండే వారందరిలోనూ తప్పులున్నాయి. కాని తప్పులు వెతికే వారు తమ తప్పులు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆలోచన అంతర్ముఖంగా ఉండాలి.

people who finds mistakes in others are many. But no one on this earth is without mistakes, those who criticize others never knew their mistakes

Monday, April 15, 2013

వేమన పద్యాలు - 5

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోప మడచె నేని కోరిక లీడేరు
విశ్వధాభిరామ వినురవేమ


కోపంవల్ల గొప్పదనం తగ్గిపోతుంది. కోపం వల్ల దుఖం కలుగుతుంది. ఆ కోపాన్ని తగ్గించినప్పుడు మాత్రమే కోరికలు తీరుతాయి.

anger harms a persons greatness, anger causes grief. If you can win over your anger, then your wishes will be fulfilled.

Tuesday, April 9, 2013

వేమన పద్యాలు - 5

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని
హీను డవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు
విశ్వధాభిరామ వినురవేమ

పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్న నలుపు పోని విధంగా ఎంత చదివినా, ఎన్ని నేర్చినా హీనుడు తన నీచ గుణాలు మానడు.

charcoal does not lose its colour even if it is washed with milk. like wise, how educated, how trained a bad person is, he do not change his character.

Thursday, April 4, 2013

వేమన పద్యాలు - 4

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయ నుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ వినురవేమ


పాడుతూ పాడుతూ ఉంటే రాగం మెరుగ్గా వస్తుంది. తింటూ తింటూ ఉంటే వేప కుడా తియ్యగా అనిపిస్తుంది. సాధన వలన పనులు సాధ్యపడతాయి.

practice makes a man perfect. For example, by singing many times tune improves and if you eat neem leaves many times the bitter taste of it becomes sweeter as our taste buds adjust to it.