ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Monday, January 26, 2015

కాకీ కాకీ గువ్వల కాకీ

కాకీ కాకీ గువ్వల కాకీ
కాకీ నాకూ ఈకా ఇస్తే
ఈకా తెచ్చి దిబ్బకు ఇస్తే
దిబ్బ నాకు ఎరువు ఇచ్చె

ఎరువూ తెచ్చి చేలో వేస్తే
చేనూ నాకు గడ్డి ఇచ్చె

గడ్డి తెచ్చి ఆవుకు ఇస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే

పాలు తీసుకెళ్ళి పంతులుకిస్తే
పంతులు నాకు పాఠం చెప్పె

పాఠం నేను మామకు చెప్తే
మామ నాకు పిల్లనిచ్చె

పిల్లపేరు మల్లెమొగ్గ
నాపేరు జమిందార్

1 comment:

  1. చిన్నప్పుడు నేను పలక పట్టుకున్నపుడు పాడుకున్న పాట ఇదే

    ReplyDelete