ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Thursday, January 29, 2015

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లుపోయంగా ఆరగించంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా
రత్నాల చెమ్మచెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరేయంగా
పందిట్లో మా బావ పెళ్ళి చేయంగ
చూచి వద్దాం రండి సుబ్బరాయుడి పెళ్ళి(సూర్యదేవుడి పెళ్ళి)
మా వాళ్ళింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి
తాతగారింట్లో పెళ్ళి తరలిరండి

3 comments:

  1. @Padmadevi N కచ్చపి సరస్వతి దేవి వీణ పేరు. ఇది కాక విపంచి, చిత్ర, కిన్నెర వంటి రకరకాల వీణలు వాయిస్తున్న చిత్రాలుకుడా గుహలలోని ( అజంతా, ఎల్లోరా మొదలైన) శిల్పాలలో చెక్కి ఉన్నాయి.

    ReplyDelete