ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Friday, February 6, 2015

చెన్నపట్నం చెరకుముక్క

చెన్నపట్నం చెరకుముక్క నీకో ముక్క నాకో ముక్క
భీమునిపట్నం బిందెలజోడు నీకో జోడు నాకో జోడు
కాశీపట్నం కాసులపేరు నీకో పేరు నాకో పేరు
విశాఖపట్నం విశనికర్ర నీకో కర్ర నాకో కర్ర
కాంచీపురం పట్టుచీర నీకో చీర నాకో చీర
నక్కపల్లి లక్కపిడతలు నీకో పిడత నాకో పిడత
కొండపల్లి కొయ్యబొమ్మలు నీకో బొమ్మ నాకో బొమ్మ
నిర్మలపట్నం బొమ్మల పలకలు నీకో పలక నాకో పలక
బంగినపల్లి మామిడిపండు నీకో పండు నాకో పండు
తెస్తానుండు ఇచ్చేదాక చూస్తూ ఉండు వచ్చేదాక

2 comments:

 1. చిన్నారి బాలగేయాలు ఎప్పుడూ మధుర రసాలే!
  (aparna vadlamani) అపర్ణ వడ్లమాని మంచి గీతాన్ని గుర్తుకు తెచ్చారు.
  నీ కృషికి ధన్యవాదాలు!
  - కాదంబరికుసుమాంబ (1955)

  ReplyDelete
 2. కుసుమాంబ గారు,
  ధన్యవాదములు. దీని వెనుక మా అమ్మమ్మ సహాయం చాలా ఉంది.

  ReplyDelete